Dec 11,2020 20:52

ప్రకృతి వ్యవసాయంతో పండించిన వరి పంటను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి

ప్రజాశక్తి - బనగానపల్లె
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని గుత్తి రోడ్డులో ఎఒ విజరు కుమార్‌ ఐదెకరాల్లో సొంతంగా ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసిన వరి పంటను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కోత కోసి నూర్పిడిని ప్రారంభించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం చేసేందుకు తన సొంత పొలం 20 ఎకరాలను ఇస్తామని హామీఇచ్చారు. ప్రకృతి వ్యవసాయంతో పండించిన కూరగాయలను అమ్ముకునేందుకు పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంతో పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు సొంత ఖర్చులతో రూమును ఏర్పాటు చేస్తానని హామీఇచ్చారు. వైసిపి నాయకులు పిఆర్‌.వెంకటేశ్వర రెడ్డి, బండి బ్రహ్మానందరెడ్డి, జిల్లెల్ల శంకర్‌ రెడ్డి, వెంకటాపురం పెద్ద వెంకట రెడ్డి, వ్యవసాయ శాఖ నంద్యాల, కోవెలకుంట్ల ఎడిఎలు రాజశేఖర్‌, ఆంజనేయ పాల్గొన్నారు.
ధ్వజస్తంభం ప్రతిష్టాపనకు హాజరైన ఎమ్మెల్యే
ప్రజాశక్తి - సంజామల
గ్రామంలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్యవైశ్యుల ఇష్టదైవం కన్యకాపరమేశ్వరి ఆశీస్సులు ఉండాలని, ఆర్యవైశ్యులు అంతా కలిసి కార్యక్రమం నిర్వహించుకోవాలని ఆయన తెలిపారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెండేకంటి కిరణ్‌కుమార్‌, కోడూరు పెద్ద పుల్లయ్య, మాజీ జడ్‌పిటిసి చిన్నబాబు పాల్గొన్నారు.