ప్రజాశక్తి - కోయిలకుంట్ల
ప్రజలందరికీ నాణ్యమైన వైద్యమందిస్తామని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో రూ.5 కోట్ల నిధులతో 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు 17 నెలల పరిపాలనలో ప్రజారోగ్యం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, అందులో భాగంగా రూ.200 కోట్ల నిధులతో 108 వాహనాలను తెచ్చారని తెలిపారు. కోవెలకుంట్ల ప్రభుత్వాస్పత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉండకూడదని 29 పోస్టులు మంజూరు చేశామని, వాటిలో 16 మంది వీధుల్లో చేరారని చెప్పారు. అనంతరం జగనన్న తోడు కార్యక్రమంలో భాగంగా 528 మంది లబ్ధిదారులకు పత్రాలను పంపిణీ చేశారు. వైసిపి రాష్ట్ర నాయకులు కర్రా హర్షవర్ధన్ రెడ్డి, వెసిపి డాక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ రామిరెడ్డి, వైసిపి యువజన నాయకులు, ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ పేరా శ్రీధర్ రెడ్డి, కోవెలకుంట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ బీవీ.నాగార్జున రెడ్డి, వైసిపి నాయకులు, జిసిఆర్ సంస్థల అధినేత సూర్యనారాయణ రెడ్డి, మండల ఇన్‌చార్జి భీమ్ రెడ్డి ప్రతాపరెడ్డి, లాయర్ మధుసూదన్ రెడ్డి, ఎల్‌వి.సుధాకర్ రెడ్డి, ఎంపిడిఒ మహబూబ్ దౌల, ఇఒ ప్రకాష్ నాయుడు, డిటి చంద్రశేఖర్, ఎపిఎం బాబు, ఆస్పత్రి వైద్యులు రామాంజనేయులు, అమడాల శంకరయ్య, కలగొట్ల మాచిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, పొట్టిపాడు అందే శ్రీనివాస్ రెడ్డి, భీమునిపాడు కర్ణాటి వీరారెడ్డి పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణానికి భూమి పూజ
బనగానపల్లె : మండలంలోని గోవిందిన్నె గ్రామంలో రూ.50 లక్షలతో నిర్మిస్తున్న ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి భూమి పూజ నిర్వహించారు. మండలంలోని గోవిందిన్నె గ్రామంలో మహా సిమెంట్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న దేవాలయానికి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, సిమెంట్ ఫ్యాక్టరీ యూనిట్ గురివిరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని మాట్లాడారు. గోవిందిన్నె గ్రామస్తులకు, మహా సిమెంట్ యాజమాన్యానికి మధ్య ఎంతో కాలంగా ఉన్న ఆలయ సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. మహా సిమెంట్ యాజమాన్యం రూ.30 లక్షల విలువ చేసే 2.50 ఎకరాల భూమితోపాటు రూ.25 లక్షలను నూతన ఆలయ నిర్మాణానికి ఇచ్చే విధంగా కృషి చేసినట్లు చెప్పారు. గ్రామస్తులు రూ.25 లక్షలు, మహా సిమెంట్ యాజమాన్యం రూ.25 లక్షలతో నిర్మించే నూతన ఆలయానికి భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు. వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుండం శేషి రెడ్డి, మండల కన్వీనర్ గుండం నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
భూమిపూజ నిర్వహిస్తున్న ఎంపీ పోచా, ఎమ్మెల్యే కాటసాని










