న్యూఢిల్లీ : ప్రీమియర్ టెక్ ఆధారిత ఆన్ డిమాండ్ లాజిస్టిక్స్ కంపెనీ పోర్టర్ కొత్త క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. క్రీడల సమయంలో డిజిటల్ ప్లాట్‌ఫారాలపై ప్రసారం చేసేందుకు మూడు ఆసక్తికర వాణిజ్య ప్రకటనలను సిద్ధం చేసినట్లు పేర్కొంది. వీటిలో తమ వేగవంతమైన, సమర్థవంతమైన, సరసమైన డెలివరీలను నిర్ధారించడంలో పోర్టర్ కట్టుదిట్టంగా అనుసరిస్తున్న నిబద్ధతను ప్రధానంగా ఈ క్యాంపెయిన్ సాగుతుందని పోర్టర్, కస్టమర్ గ్రోత్ మరియు ఎంగేజ్‌మెంట్ ఉపాధ్యక్షుడు మోహిత్ రాఠీ పేర్కొన్నారు. ప్రస్తుత క్రికెట్ పోటీల డిమాండ్‌ను లక్ష్యంగా చేసుకున్నామన్నారు.