
- డెత్ డే కేక్ కటింగ్ చేసిన మాజీ మంత్రి పాలేటి
ప్రజాశక్తి - చీరాల : మాజీ మంత్రి పాలేటి రామారావు తాను బ్రతికుండగానే తన 11వ మరణ దినోత్సవ వేడుకలను తానే స్థానిక టిడిపి కళ్యాణమండపంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మరణ దిన వేడుకలలో అందరు మత బోధకుల మధ్య ఆయన తన డెత్ డే కేకును తానే కట్ చేసారు.ఈ సందర్భంగా ఆయన ఆత్మీయులు పలువురు డెత్ డే శుభాకాంక్షలు తెలిపారు. తన జీవిత కాలాన్ని 75 సంవత్సరాలుగా అంచనాలు వేసి తనకు ప్రస్తుతం 64 సంవత్సరాలు అని ఈ తరుణంలో తన జీవితకాలం ఇంకా 11 సంవత్సరాలు అంటూ మాట్లాడారు. మిగిలిన బ్రతుకు దినములు అన్ని ప్రేమానురాగాలతో అందరితో ఆత్మీయంగా ఉంటూ ముందుకు సాగాలని అన్నారు. ప్రతి ఏటా తన మనదిన వేడుకలను నిర్వహిస్తానని అన్నారు. అనంతరం ఆత్మీయులు అందరికీ తేనేటి విందును ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో హిందూ, ముస్లిం,క్రైస్తవ మత బోధకులు, ఆత్మీయులు ప్రముఖులు పాల్గొన్నారు.