న్యూఢిల్లీ : ప్రముఖ వెబ్‌సైట్ వికిపీడియాను పునరుద్ధరించాలని పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఆదేశించారు. ఇస్లాం మతాన్ని అగౌరవపరిచేలా ఉన్న కంటెంట్‌ను తొలగించకపోవడంపై గతవారం వికీపీడియాపై పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ అంశంపై ప్రాథమిక పరిశీలన కోసం చట్టం, ఆర్థిక వ్యవహారాలు, సమాచార మంత్రులతో కూడిన ఓ కమిటీని నియమించారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. విజ్ఞానం, సమాచార వ్యాప్తి కోసం వికీపీడియా అవసరమని ప్రధాని నియమించిన కమిటీ సూచించిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే నిషేధాన్ని ఎత్తివేయాలని సిఫారసు చేసింది. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను క్రమ పద్ధతిలో ఎలా నియంత్రించాలో కమిటీ సూచనలు ఇచ్చిందని ఆ ప్రకటన పేర్కొంది.










