Feb 10,2021 23:54

అపార్ట్‌మెంట్స్‌ అసోసియేషన్‌ నూతన కమిటీ సభ్యులు

ప్రజాశక్తి-తాడేపల్లి : ఇంటిపన్నుల పేరుతో ప్రజలపై భారాలువేయడం తగదని తాడేపల్లి పట్టణ పౌర సంక్షేమ సంఘం (టిపిపిఎస్‌ఎస్‌), కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ తాడేపల్లి (క్యాట్‌) సమావేశం తీర్మానించింది. సుందరయ్యనగర్‌ కట్ట, క్రిస్టియన్‌పేట మధ్యనున్న వాయువ్యప్రాంత అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ నూతన కమిటీ బుధవారం ఎన్నికైంది. ఈ సందర్భంగా టిపిపిఎస్‌ఎస్‌, క్యాట్‌ ప్రతినిధులు మాట్లాడుతూ మున్సిపాల్టీల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు లక్షలకోట్లు పన్నులు చెల్లిస్తున్నారని తెలిపారు. మున్సిపాలిటీ నిర్వహణకు అయ్యే ఖర్చును కూడా ప్రజలే భరించాలని చెప్పడం సరికాదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మున్సిపల్‌ చట్ట సవరణ వెనక్కు తీసుకోవాలని కోరారు. అనంతరం టిపిపిఎస్‌ఎస్‌, క్యాట్‌ సంయుక్తంగా ఏర్పాటుచేసిన వాయువ్య కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా చంద్రశేఖర్‌(విఆర్‌అపార్ట్‌మెంట్‌), జి.రోహిత్‌(శ్రీచక్ర అపార్ట్‌మెంట్‌), ఉపాధ్యక్షులుగా ఎస్‌కె. మౌలాలి(విశ్రాంత ఎజిఎం), సహాయ కార్యదర్శులుగా ఇందిర, సతీష్‌తోపాటు 24 మందితో నూతన కార్యవర్గం ఏర్పాటైంది. కార్యక్రమానికి అసోసి యేషన్‌ నాయకులు జి. మోహనరావు, పి.రామచంద్రరావు, డి.విజయభాస్కరరెడ్డి, ప్రొఫెసర్‌ బూరగ శ్రీనివాసరావు పాల్గొన్నారు.