Jan 28,2021 23:09

6వ వార్డులో నిర్మాణమవుతున్న డ్రెయిన్లను పరిశీలిస్తున్న మున్సిపల్‌ కమిషసనర్‌ రవిచంద్రారెడ్డి

ప్రజాశక్తి - తాడేపల్లి : పట్టణంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధిపనులను తాడేపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ సి.రవిచంద్రారెడ్డి పరిశీలించారు. 6వ వార్డులో మున్సిపల్‌ సాధారణ నిధులతో నిర్మాణమవుతున్న సిసి డ్రెయిన్‌ నిర్మాణ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. కృష్ణనగర్‌ పాత పంచాయతీ కార్యాలయం సమీపంలో రూ.5లక్షలతో మొక్కలు పెంచి సుందరీకరణ పనులను పరిశీలించారు. 14వ ఆర్థికసంఘం రూ.14లక్షల వ్యయంతో నిర్మించబోతున్న అంతర్గత రోడ్లను పరిశీలన చేశారు. కమిషనర్‌ వెంట మున్సిపల్‌ ఎఈలు ప్రవీణ్‌, కిశోర్‌, టౌన్‌ప్లానింగ్‌ అధికారి గోవిందకుమారి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ డేవిడ్‌రాజు, మున్సిపల్‌ ప్రభుత్వ శాఖల అధికారులు ఉన్నారు.