
ప్రజాశక్తి - కాకినాడ సిటీ, యానాం 'పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ట్రాన్స్‌పోర్టు కార్మికులు బుధవారం వివిధ రూపాల్లో నిరసన తెలిపారు.' కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆలిండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ దేశ వ్యాప్త పిలుపలో సిఐటియు ఆధ్వర్యంలో ట్రాన్స్ పోర్ట్ సంఘాల నాయకులు, కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు, ఆటో యూనియన్ నగర అధ్యక్షుడు తాతపూడి మూర్తి, నాయకులు అంజిబాబు, ట్యాక్సీ యూనియన్ కార్యదర్శి సరగడ చంద్రశేఖర్, బస్ ఓనర్స్ నాయకులు ఎం.వి.రమణ(చిన్న) జెసిబి డ్రైవర్స్ యూనియన్ నాయకులు శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ పోర్ట్ రంగంపై దారుణంగా భారాలు వేస్తుందన్నారు. మోటారు వాహన సవరణ చట్టం తెచ్చి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కరోనా సమయంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా దేశంలో మాత్రం విపరీతంగా పెరిగిపోయాని విమర్శించారు. తాజాగా కేంద్ర బడ్జెట్‌లో కూడా సెస్ పేరుతో పెట్రో భారాలు వేశారన్నారు. ఇలా ధరలు పెంచుకుంటూ పోతే ట్రాన్స్ పోర్ట్ రంగంపై ఆధారపడిన వారు ఎలా బతకాలని ప్రశ్నించారు. పాలకులు కార్పొరేట్‌ల వైపు నుంచి కాకుండా సామాన్యుల వైపు నుంచి ఆలోచించి విధానాలు రూపొందించాలన్నారు. డ్రైవర్‌లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. ధర్నా అనంతరం కలెక్టరేట్‌లో వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ, నాయకులు జి.శాస్త్రి, కె.సత్తిరాజు, వి.చంద్రరావు, నగర ప్యాసింజర్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు రాంప్రసాద్, మూర్తి, సత్తిబాబు, రాంబాబు, మోహన్, జ్యోతిబాబు, ఏడుకొండలు, నిర్మల కుమార్, కేశవ, చరణ్, చిన్న, బుజ్జి, పెంకే శ్రీను, శ్రీలక్ష్మి గణపతి టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ కల్చరల్ అసోసియేషన్ నాయకులు వీరభద్రం, రమణ, నాగబాబు, దయాకర్, వెంకన్న బాబు, సూరిబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. యానాంలో సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో ట్రాన్స్ పోర్ట్ కార్మికులు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని యానాం-ద్రాక్షారామం రోడ్డులో రాస్తారోకో చేశారు. యానాం సిఐటియు కన్వీనర్ కుంచె సత్యనారాయణ మట్లాడారు. పెట్రో ఛార్జీలు తగ్గించాలని, రవాణా వాహనాలపై భారీగా విధిస్తున్న చలానా ఫీజులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శీలం సత్యనారాయణ, వై.శ్రీనివాస్, కుడిపూడి కుమార్, కొండే కష్ణప్రసాద్, రేవు విష్ణుమూర్తి, కముజు రమణ, చిన్ని తదితరులు పాల్గొన్నారు.