Jun 02,2023 16:43

ప్రజాశక్తి-అద్దంకి : వరి గడ్డివాములు ప్రమాదవశాత్తు దాదాపు 13 ఎకరాలలోని ఏడుగురు రైతులకు చెందిన పశుగ్రాసమంతా కాలి బూడిదయిందైనా ఘటన మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలో శుక్రవారం జరిగింది. గడ్డివాములల్లో మంటలు చెలరేగిన అనంతరం స్థానికులు గమనించి యజమానులకు అద్దంకి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అసలే పశుగ్రాసం కొరతతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో ఇలా దగ్ధం కావడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామానికి చెందిన అడుసుమల్లి మురళి, కమ్మ శ్రీను, వెంకటేశ్వర్లు, గండు చిరంజీవి, నర్రా గోపాల్ వరిగడ్డి పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. మంటల్లో బూడిదైన వరిగడ్డి వాములు ఆస్తి నష్టం దాదాపు రెండు లక్షల పైన ఉండవచ్చునని  రైతులు తెలిపారు.