ప్రజాశక్తి-భట్టిప్రోలు : భట్టిప్రోలు మండలం సురేపల్లి పంచాయతీ పరిధిలోని తాతావారి పాలెం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు వరి కుప్పలకు నిప్పంటించారు. గ్రామానికి చెందిన పడమట శివరామకృష్ణకు చెందిన 1.50 ఎకరాల వరి కుప్ప దగ్ధం అయ్యింది. గత రెండు నెలల కాలంలో నాలుగు వరి కుప్పలు, రెండు వరి గడ్డి వాములు అగ్గిపాలయ్యాయి. దీనికి కారకులైన వారిని పట్టుకుని శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు. కాగా గురువారం జరిగిన ఘటనలో అగ్నిమాపక సిబ్బంది మంటలు అడుపుచేసే ప్రయత్నం చేయగా గ్రామ రైతులు కుప్ప కాలిపోకుండా కాపాడే ప్రయత్నం చేశారు.










