Jul 19,2023 15:55

ప్రజాశక్తి-మంగళగిరి : విద్యారంగ పరిరక్షణపై విద్యార్థులు పోరాటాలను ఉధృతం చేయాలని సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పి మధు అన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యాలయం వద్ద ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులను, విద్యార్థులను అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థులు విడుదలైన తర్వాత మంగళగిరి ఎస్ఎఫ్ఐ కార్యాలయం చేరుకున్నారు. కార్యాలయంలో ఉన్న విద్యార్థి సంఘ నాయకులను, విద్యార్థులను సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పి మధు పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న విధానాల వలన పేదలకు విద్యను దూరం చేసే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశ పెట్టడం వలన పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం లో చదవలేక విద్యకు దూరమవుతున్నారని అన్నారు. మూడు, నాలుగు, ఐదు తరగతులను హైస్కూల్లో కలపడం వలన లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారా అన్నారు. విద్యారంగంలో ఉన్న కాళీ పోస్టులను భర్తీ చేయకపోవడం వలన ప్రభుత్వ పాఠశాలలో బోధించడానికి ఉపాధ్యాయులు లేకపోవడం వలన ఉత్తీర్ణత శాతం తగ్గుతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు కేటాయింపులు తగ్గిస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే విధానాలను పాలకుల అవలంబిస్తున్నారని అన్నారు. విద్యారంగంలో ఉన్న సమస్యలపై విద్యార్థులు సంఘటన సంఘటన ఉండి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్, కార్యదర్శి అశోక్, ఉపాధ్యక్షులు పరమేష్, రాష్ట్ర నాయకులు ఎం బాలాజీ సోమేశ్వరావు, వెంకటేశ్వర్లు, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న తదితరులు పాల్గొన్నారు