
ఆఫ్ఘనిస్తాన్‌పై 149పరుగుల తేడాతో గెలుపు
చెన్నై: ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ హవా కొనసాగిస్తోంది. చెపాక్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాంండ్ జట్టు 149 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 288 పరుగులు చేయగా.. ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 34.4ఓవర్లలో 139పరుగులకే కుప్పకూలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను తొలుత ఆఫ్ఘన్ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో కివీస్ 110పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో కెప్టెన్ లాథమ్(68), ఫిలిప్స్(71) కలిసి 5వ వికెట్‌కు 144పరుగులు జతచేశారు. ఓపెనర్ యంగ్ విల్ యంగ్ 64 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 54 పరుగులతో మెరవగా.. టామ్ లాథమ్ 74 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ 80 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 71 పరుగులు చేశారు. తొలుత రచిన్ రవీంద్ర(32).. చివర్లో మార్క్ చాప్మన్(25నాటౌట్) బ్యాటింగ్‌లో రాణించారు. ఆఫ్ఘన్ బౌలర్లలో నవీనుల్ హక్, అజ్మతుల్లాకు రెండేసి, ముజీబుర్ రెహ్మాన్, రషీద్ ఖాన్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.
ఛేదనలో ఆఫ్ఘన్ ఓపెనర్లు గుర్బాజ్(11), జడ్రాన్(14) నిరాశపరచగా.. రామత్ షా(36), అజ్మతుల్లా(27) ఫర్వాలేదనిపించారు. ఆఫ్ఘన్ జట్టు 107పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి పటిష్టంగా ఉన్నా.. ఆ తర్వాత 32పరుగుల వ్యత్యాసంలో మిగిలిన ఐదు వికెట్లను కోల్పోయింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఆఫ్ఘన్ పరాజయంపాలైంది. సాంట్నర్, ఫెర్గ్యుసన్‌కు మూడేసి, బౌల్ట్‌కు రెండు, హెన్రీ, రవీంద్రకు ఒక్కో వికెట్ దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫిలిప్‌కు లభించింది.
స్కోర్‌బోర్డు..
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (ఎల్‌బి)ముజీబ్ 20, యంగ్ (సి)అలిఖిల్ (బి)అజ్మతుల్లా 54, రవీంద్ర (బి)అజ్మతుల్లా 32, మిఛెల్ (సి)ఇబ్రహీమ్ జడ్రాన్ (బి)రషీద్ ఖాన్ 1, లాథమ్ (బి)నవీన్‌ాఉల్‌ాహక్ 68, ఫిలిప్స్ (సి)రషీద్ ఖాన్ (బి)నవీన్-ఉల్-హక్ 71, ఛాప్మన్ (నాటౌట్) 25, సాంట్నర్ (నాటౌట్) 7, అదనం 10. (50 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 288పరుగులు.
వికెట్ల పతనం: 1/30, 2/109, 3/110, 4/110, 5/254, 6/255
బౌలింగ్: ముజీబ్ 10-0-57-1, ఫారుఖీ 7-1-39-0, నవీన్-ఉల్-హక్ 8-0-48-2, నబి 8-1-41-0, రషీద్ ఖాన్ 10-0-43-1, అజ్మతుల్లా 7-0-56-2.
ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (బి)హెన్రీ 11, జడ్రాన్ (సి)సాంట్నర్ (బి)బౌల్ట్ 14, రహమత్ షా (సి అండ్ బి)రవీంద్ర 36, హస్మతుల్లా (సి)సాంట్నర్ (బి)ఫెర్గ్యుసన్ 8, అజ్మతుల్లా (సి)లాథమ్ (బి)బౌల్ట్ 27, ఇక్రమ్ అలిఖిల్ (నాటౌట్) 19, మహ్మద్ నబీ (బి)సాంట్నర్ 7, రషీద్ ఖాన్ (సి)హెన్రీ (బి)ఫెర్గ్యుసన్ 8, ముజీబ్ (సి)యంగ్ (బి)ఫెర్గ్యుసన్ 4, నవీన్-ఉల్-హక్ (సి)ఛాప్మన్ (బి)సాంట్నర్ 0, ఫారుఖీ (సి)మిఛెల్ (బి)సాంట్నర్ 0, అదనం 5. (34.4ఓవర్లలో) 139ఆలౌట్.
వికెట్ల పతనం: 1/27, 2/27, 3/43, 4/97, 5/107, 6/125, 7/134, 8/138, 9/139, 10/139
బౌలింగ్: బౌల్ట్ 7-1-18-2, హెన్రీ 5-2-16-1, సాంట్నర్ 7.4-0-39-3, ఫెర్గ్యుసన్ 7-1-19-3, ఫిలిప్స్ 3-0-13-0, రవీంద్ర 5-0-34-1.