
- గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అడ్డగించిన గ్రామస్తులు
ప్రజాశక్తి-అచ్యుతాపురం : అచ్చుతాపురం మండలం పూడిమడక గ్రామంలో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటించిన ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజును వైసీపీ పార్టీ నాయకులు గ్రామస్తులు వ్యతిరేకించారు. ఎమ్మెల్యే గ్రామంలో ఇంటింటికి తిరగకుండా అడ్డగించారు. అలాగే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వ్యతిరేకవర్గం చెందిన వారు నినాదాలు చేశారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలు సహాయంతో కార్యక్రమాన్ని కొనసాగించారు. అయినప్పటికీ వర్షాలు సైతం లెక్కచేయకుండా గొడుగు పట్టుకుని గడపగడప కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కన్నబాబు రాజు కొనసాగించారు.