Jul 10,2023 14:25

ప్రజాశక్తి-అద్దంకి : ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని అతి వేగంగా వచ్చి లారీ ఢీకొన్న ఘటనలో మహిళ మృతి చెందింది. సోమవారం అద్దంకి తిమ్మాయపాలెం రోడ్ లో ఈ ప్రమాదంలో ఆళ్ల స్వప్న(34) మృతిచెందగా భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం నూజిల్లపల్లి గ్రామానికి చెందిన అద్దంకి పట్టణంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో వారి కుమారుడు ఫీజు విషయములు గురించి మాట్లాడి ఇంటిలో కావలసిన సరుకులు తీసుకుని వెళుతున్న సమయంలో ఇటుక తయారుకు ఉపయోగించే మట్టి తరలించే లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఢీకొట్టడంతో అనంతరం లారీ ప్రమాద స్థలం నుంచి అతివేగంతో దూసుకు వెళ్ళాడు. స్థానికులు లారీ వెంటపడి నిలుపుదల చేశారు. ఘటనా స్థలాన్ని సిఐ ఆర్  ఉమేష్ పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతురాలను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలకు భర్త ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేపట్టారు.