ప్రజాశక్తి-వడ్డాది : బుచ్చయ్యపేట మండలం వడ్డాది పెద్దేరు నదిలో బుధవారం స్నానానికి దిగి ఎర్రం శెట్టి వెంకటరమణ అనే వ్యక్తి మృతి చెందాడు. సమీప బంధువు ముత్యాలు ఈశ్వరమ్మ మృతి చెందడంతో ఆమె అంతిమయాత్రలో పాల్గొని దహన సంస్కారాల పూర్తయిన తర్వాత స్నానానికని నదిలో దిగి ఊపిరాడక మృతి చెందాడు. స్థానికులు వెంటనే మృత దేహాన్ని గాలించి బయటకి తీశారు. అప్పటికే వెంకట రమణ మృతి చెందారు. దహన సంస్కారాలకని వెళ్లిన వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంపై భార్య చిలుకమ్మ, కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.










