Mar 03,2023 15:38
  •  పరారీలో నిందితుడు 
  • చీరాలా ఏరియా వైద్యశాలలో వృద్ధురాలకు చికిత్స అందిస్తున్న వైద్యులు 
  • తమ వార్డు నుండి కామాంధుడిని వెలివేయాలంటూ వార్డు ప్రజలు ఆందోళన 

ప్రజాశక్తి: చీరాల: గంజాయి మత్తులో వృద్ధురాలిపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. చీరాల మండలం మరియమ్మపేట లో ఈ ఘటన వెలుగు చూసింది. గత కొంతకాలంగా గంజాయి విక్రయాలు జరుగుతూ యువతను తప్పుదోవ పట్టిస్తున్న కామాంధుడు దేవర వెంకటేష్ అలియాస్ (బండ ). వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని మరియమ్మ పేటలో నివాసం ఉంటున్న గారపాటి తెరీజమ్మ అనే వృద్ధురాలిపై దేవర వెంకటేష్ అలియాస్ బండ అనే యువకుడు శుక్రవారం అర్ధరాత్రి అందరు నిద్రిస్తున్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే స్థానికులు గమనించి దుండగుడు వెంకటేష్ ను పట్టుకున్నే ప్రయత్నం చేసేసరికి అక్కడ నుండి పరారయ్యాడు. వృద్ధురాలును చీరాల ఏరియా వైద్యశాలలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గంజాయి విక్రయలు జరుపుతూ యువతను తప్పదవ పట్టిస్తున్న కామాంధుడు వెంకటేష్ను తమ గ్రామం నుండి వెలివేయాలంటూ వార్డు ప్రజలు కోరుతున్నారు. పోలీసులు తక్షణమే కామాంధుడిని పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.