
ప్రపంచకప్‌లో చెన్నైలో న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 288 పరుగులు చేసి.. ఆఫ్ఘనిస్తాన్‌కు 289 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. 7 ఓవర్‌లోనే న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే(20) ముజీబ్ ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రచిన్ రవీంద్ర 32 పరగులు చేసిన రచిన్ రవీంద్ర, 54 పరగులు చేసిన విల్ యంగ్ అజామతుల్లా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరారు. ఆవెంటనే డారిల్ మిచెల్ 1 పరుగు మాత్రమే చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 113 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ సయంలో క్రీజులోకి వచ్చిన టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్ జుట్టు 250 పరుగుల మార్క్‌ను అందుకునేలా చేశారు. టామ్ లాథమ్ 74 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సల సాయంతో 68 పరుగులు చేయగా , గ్లెన్ ఫిలిప్స్ 80 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 71 పరుగులు చేశాడు. వీరిద్దరిని నవీన్-ఉల్-హక్ ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు పంపాడు. అంతరం క్రీజులోకి వచ్చిన మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్ వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. మార్క్ చాప్‌మన్ 12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 25 పరుగులు చేయగా, మిచెల్ సాంట్నర్ 5 బంతుల్లో 7 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్ 6 288 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నవీన్-ఉల్-హక్, అజామతుల్లా తలో రెండు వికెట్లు తీయగా, ముజీబ్ 1, రషీద్ 1 వికెట్ తీసుకున్నారు.
- 40 ఓవర్లు.. న్యూజిలాండ్ 185/4
40 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 185 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ 59 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ సాయంతో 37 పరగులు, టామ్ లాథమ్ 51 బంతుల్లో 31 పరుగులు చేశారు. మరో వికెట్ పడకుండా ఉంటే న్యూజిలాండ్ 270 పరుగులు చేసే అవకాశం ఉంది.
- నిలకడగా న్యూజిలాండ్ బ్యాటర్లు
న్యూజిలాండ్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. 35 ఓవర్లు పూర్తయ్యే సరకి 163 పరుగులు చేశారు. టామ్ లాథమ్40 బంతుల్లో 25 పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ 40 బంతుల్లో 26 పరుగులు చేశారు.
- 30 ఓవర్లకు.. న్యూజిలాండ్ 138/4
·30 ఓవర్లు పూర్తయ్యే సరికి న్యూజిలాండ్ 138 పరుగులు చేసింది. టామ్ లాథమ్ 27 బంతుల్లో 11 పరుగులు , గ్లెన్ ఫిలిప్స్ 23 బంతుల్లో 16 పరుగులు చేశాడు. మరోవైపు వికెట్ల కోసం ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
- 25 ఓవర్లు పూర్తి.. న్యూజిలాండ్ 120/4
25 ఓవర్లు పూర్తయ్యే సరికి న్యూజిలాండ్ 120 పరుగులు చేసింది. టామ్ లాథమ్ 5, గ్లెన్ ఫిలిప్స్ 3 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నారు. అంతకు ముందు విల్ యంగ్ 54, కాన్వే 20, రచిన్ రవీంద్ర 32, డారిల్ మిచెల్ 1 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరారు.
- డారిల్ మిచెల్ ఔట్.. న్యూజిలాండ్ 113/4
రషీద్ ఖాన్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్ ఇబ్రహీం జద్రాన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో న్యూజిలాండ్ 4వ వికెట్ కోల్పోయింది. క్రీజులో టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్ ఉన్నారు.
- ఒకే ఓవర్‌లో 2 వికెట్లు
ఒకే ఓవర్‌లో 2 వికెట్లు పడటంతో న్యూజిలాండ్ కష్టాలో పడింది. అజామతుల్లా బౌలింగ్‌లో తొలుత 21 ఓవర్ 2వ బంతికి 32 పరగులు చేసిన రచిన్ రవీంద్ర క్లీన్ బౌల్డ్ అవ్వగా... చివరి బంతికి 54 పరగులు చేసిన విల్ యంగ్ ఇక్రమ్ అలీఖిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది.
- విల్ యంగ్ 50
56 బంతుల్లో విల్ యంగ్ 4 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో అర్థశతకం సాధించాడు. న్యూజిలాండ్ ప్రస్తుతం 18ఓవర్లు పూర్తయ్యే సరికి వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది
- 13 ఓవర్లకు న్యూజిలాండ్ 65/1
13 ఓవర్లకు న్యూజిలాండ్ 65 పరుగులు చేసింది విల్ యంగ్ 42 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్స్ సాయంతో 35 పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర 19 బంతుల్లో 11 పరుగులు చేశాడు. మరోవైపు వికెట్ల కోసం ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
- 10 ఓవర్లు పూర్తి.. న్యూజిలాండ్ 43/1
10 ఓవర్లు పూర్తయ్యే సరికి న్యూజిలాండ్ 1 వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. విల్ యంగ్ 33 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్ సాయంతో 23 పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర 9 బంతులాడి ఇంకా ఖాతా తేరవలేదు.
- కాన్వే ఔట్
న్యూజిలాండ్ ఓపెనర్ కాన్వే 18 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 20 పరుగులు చేసి ముజీబ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి రచిన్ రవీంద్ర వచ్చాడు. యంగ్ 21 బంతుల్లో 10 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నాడు. న్యూజిలాండ్ 7 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది.
- 6 ఓవర్లకు 26
6 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 26 పరుగులు చేసింది. కాన్వే 15 బంతుల్లో 16 చేయగా, యంగ్ 21 బంతుల్లో 10 పరుగులు చేశాడు.
- టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ బౌలింగ్
చెన్నై :ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ చెన్నైలో న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కెన్ విలియమ్ స్థానంలో లాథం కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
న్యూజిలాండ్ (ప్లేయింగ్ ): డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (ష/ష), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ ): రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(సి), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్(ష), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్హా