- ఎంపిడిఓ జాన్ లింకన్.
ప్రజాశక్తి-ఆలమూరు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంగన్వాడి కేంద్రాల్లో విధుల్లో ఉన్న టీచర్లు, హెల్పర్లు పాత్ర ఆమోఘమని ఎంపీడీవో కె.జాన్ లింకన్, ఎంఈవో2 సుబ్బరాజు అన్నారు. మండల కేంద్రంలోని సచివాలయం వద్ద ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఆరోగ్య సురక్ష కోసం అంగన్వాడీలు ఉత్తమ పౌష్టికాహార ప్రదర్శనను వారు క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ పథకాల్లో అంగన్వాడీలు చేస్తున్న సేవలను వారు అభినందించారు. గర్భిణీలు, బాలింతలు చిన్నారుల విషయంలో వారు మంచి శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. గర్భిణీల విషయంలో మరింత శ్రద్ధ తీసుకొని ఏ ఒక్క శిశువును నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎన్. లావణ్య కుమార్ రాజా, ఏవో రామ్ స్వరూప్, ఈవోపీఆర్డి రాజకుమార్, ఏపీఎం ఎం.ధనరాజు, కార్యదర్శి కె.సంజీవరెడ్డి, సూపర్వైజర్లు నాగలక్ష్మి, వరలక్ష్మి, అంగన్వాడీలు, తదితరులు పాల్గొన్నారు.










