ప్రజాశక్తి-గణపవరం : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు 27 వర్ధంతిని టిడిపి ఆధ్వర్యంలో కొత్తపల్లిలో బుధవారం నిర్వహించారు. సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు పాల్గొన్న ఉంగుటూరు మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో పాలను పోవాలని సైకిల్ పాలన రావాలని అన్నారు. జగన్ పరిపాలనలో ప్రజలు లాభం పడకపోయినా జగన్ కుటుంబం వైసిపి నాయకులు భారీగా లాభాల్లో పడ్డారని అన్నారు. ప్రజల సొమ్ముతో ఒలంటీర్లకు జీతాలు ఇస్తూ వైసిపి పార్టీ కార్యక్రమంలో వాడుకుంటున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు సభలు సమావేశాలు ఆందోళనలో నిర్వహించకుండా ఎందుకు జీవో నెంబరు ఒకటి జారీ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ నాయకులు ఇందుకూరు కృష్ణంరాజు ఏళ్ళ సుబ్బారావు షేక్ మీరా కోనసాని నాగేశ్వరరావు కూసంపూడి సురేంద్రకుమార్, రాజు, నియేజకవర్గం నాయకులు.కార్యకర్తలు పాల్గొన్నారు










