ప్రజాశక్తి-పాడేరు : అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో బుధవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వరల్డ్ నో టొబాకో డే ను నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సి జమాల్ బాషా అధ్యక్షతన జిల్లా ఎన్సీడీ.పీఓ డాక్టర్ భారతీ కుమారి దేవి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వద్ద ఉదయం 9 గంటలకు వైద్య సిబ్బందితో ప్రతిజ్ఞ చేయిస్తూ, జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. పాత బస్టాండ్ వద్ద మానవ హారం నిర్వహించి పొగాకు వినియోగం విడనాడాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు వైద్యాధికారులు మాట్లాడుతూ పొగాకు వాడటం వలన కలిగే దుష్ప్రభావాలను వివరిస్తూ ప్రజలందరికీ పొగాకు ఉత్పత్తులు వాడకమునకు దూరంగా ఉండమని హెచ్చరించారు. ఏ.ఎస్.ఆర్ జిల్లాలో పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని గణనీయంగా తగ్గించడానికి వైద్య ఆరోగ్య సిబ్బంది అందరూ కృషి చేయాలని మరియు దీనికోసం ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్, డాక్టర్. కృష్ణారావు , డిప్యూటీ డెమో రవి, వైద్యాధికారులు, డ్రగ్ అడిక్షన్ సెంటర్ సిబ్బంది మరియు పాడేరు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థినీలు, ఆశా వర్కర్లు కమ్యూనిటీ ఆరోగ్య కార్యకర్తలు నైస్ ఫౌండేషన్ స్టాఫ్ మరియు డిస్ట్రిక్ట్ ఎన్ టి పి సి సోషల్ వర్కర్స్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.










