Feb 08,2023 10:56

ప్రజాశక్తి-నర్సిపట్నం : తరాలుమారిన తాతలు మారినా నాన్ షేడ్యూల్డ్ ఏరియాలో గిరిజనులు,బ్రతుకులు మార లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు. బుధవారం అయిన ఓ ప్రకటన విడుదల చేసారు. జిల్లాలోని, నర్సిపట్నం చోడవరం వి,మాడుగుల నియోజకవర్గాలలో దాదాపుగా 320 గిరిజన గ్రామాలు 95 వేలు మంది జనాభా ఉన్నారు. వీరు పేరుకు మాత్రమే గిరిజనులు వీరికి ప్రభుత్వం నుండి వచ్చే ప్రత్యేక మైన రాయితీలు సంక్షేమ పధకాలు స్కేములు రిజర్వేషన్లు స్పేషల్ డిఎస్సీ లాంటి ఉద్యోగాల్లో అవకాశం లేదు. 1/70 భూ బాదాయింపు లాంటి చట్టం వర్తించడం లేదు. విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. రాజకీయ రీజర్వేషన్లు సైతం గిరిజనేతరుల చేతుల్లో  ఉంటున్నాయి. వీరిని రాజ్యంగలోని ఐదవషేడ్యూల్ లో చేరిస్తేనే గిరిజనులకు గుర్తింపు వస్తుంది. కాని పాలకులకు వీరి గోడు పట్టడం లేదు అనేక ఎళ్ళ పోరాట పలితంగా  ఎట్టకేలకు వైఎస్సార్ పార్టీ అదికారంలోకి వచ్చిన తరువాత గిరిజన సలహమండలి నాన్ షేడ్యూల్డ్ ఏరియా గిరిజన గ్రామాలు యెక్క జాబితాను అడిగింది. తహశీల్దార్లు జాబితాలను తయారు చేసి జిల్లా కలెక్టర్లకు పంపించారు. కాని ఈమూడు నియోజకవర్గల్లో అదికార పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే నాన్ షేడ్యూల్డ్ ఎరియాలోని గిరిజనులు అన్నివిధాలా అబివృద్ది చేందారని ఇప్పుడు ప్రత్యేక అబివృద్ది చేందడం ఎముందని, తోక్కి పెట్టి వ్యతిరేఖించడం వలనే రాష్ట్ర ప్రభుత్వానికి జాబితాలు నేటికీ చేరలేదు. జిల్లాలు పునర విభజన తరువాత అల్లూరి జిల్లాగ పాడేరు ఎర్పడింది. ఇప్పటి వరకు ఎంతో కోంత నాన్ షేడ్యూల్డ్ ఎరియా గిరిజనులకు సమస్యలు చేప్పుకోనె ఐటిడిఎ కూడా లేకుండా పోయింది విరి కష్టాలు చేప్పు కోవడానికి ఇప్పటి వరకు ప్రత్యేక  అదికారి లెకపోవడం గిరిజనులు బ్రతుకులు మరింత అయోమయంలో పడ్డాయి. వీరికోసం ప్రత్యేకంగా ఒక ట్రైబుల్ డెవలాప్ మెంట్ ఆపీసరును నియమించాలి. ఎన్నికల సమయంలో ఓట్లు కోసం మాత్రం హమిలు గుప్పించడం తప్ప వీరి సమస్యకు శాస్వత పరిష్కారం చూపడం లెదు నేటికీ పూరిగుడిసెల్లో నివస్తున్నారు, ఉదాహరణకు కేటిపాలెం బోర్రచింత రామాన్నపాలెం కోడాపల్లి పూలగరువు బుచ్చంపాలెం నగరంపాలెం తాడిపూడి కించుమండ బోడిగరువు నెరెళ్ళపూడి మదన గరువు వీరబంద్రిపెట చీడికాడమండలంలోని జయపురం ముడిచర్ల కోండింపూడి గోప్పూరు చేరుగుబల్లి, మళ్ళపాడు జాజులపాలెం గోడుగు మామిడి రెళ్ళలపాలెం కోత్తవీది బందవీది కోండవీది మాడుగులమంండలోని మామిడి పాలెం చినబోడ్డరేవు అనందపురం లక్ష్మీపురం అజయ్ పురం కోండవీది చినపిట్టగెడ్డ రాసగోప్పూరు సిరిపురు వీరనారాయణం కోండవీది చినగోర్రి గెడ్డ పెదగోర్రిగెడ్డ పసువులలుబంద,జోగంపేట రాయిపాలెం కాంకోట శంకరంగోప్పూరు,బుట్లజాలంపల్లి చలిసింగం,గ్రామాలకు రోడ్లు సౌకర్యం లెక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలా చూస్తే జిల్లాలోని నాన్ షేడ్యూల్డ్ ఎరియా గిరిజన గ్రామాల్లో వందలాది గ్రామాలకు రోడ్లు సౌకర్యం లేదు చదువు కోవాడానికి ప్రత్యేక గిరిజన పాఠశాలలు లెవు. గిరిజనులకు స్వయం ప్రత్తిపత్తి రావాలంటే రాజ్యంగంలో ఐదవ షేడ్యూల్ చేర్చక పోవడం చారిత్రక తప్పిదం అయిన నాన్ షేడ్యూల్డ్ ఏరియాలో గిరిజనులు పాలకులు నిర్లక్ష్యనికి గురి అవుతున్నారని వెంకన్న తెలిపారు. వెంటనే పాలకులు నిర్లక్ష్యం విడనాడి నాన్ షేడ్యూల్డ్ గిరిజన గ్రామాలను ఐలవషేడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేశారు.