
న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ సీనియర్ నేత మనీస్ సిసోడియాకు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ తిరస్కరించింది. దీంతో ఆయన మరో ఆరు నెలల పాటు జైలులోనే ఉండాల్సి వుంది. ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు విచారణ సంస్థలు సరైన సమాధానాలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.336 కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని, దర్యాప్తు సంస్థ 6-8 నెలల్లో ట్రయల్ పూర్తి చేస్తామంటోందని ధర్మాసనం పేర్కొంది. అప్పటికీ విచారణ పూర్తి కాకపోతే దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది.