Nov 22,2023 08:39

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆరెపణలెదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా జ్యుడిషయిల్‌ కస్టడీని ఢిల్లీ రూస్‌ అవెన్యూ కోర్టు మంగళవారం డిసెంబర్‌ 11 వరకు పొడిగించింది. ఈ కేసులో నిందితులకు సంబంధించి ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) ఇంకా అనేక పత్రాల్ని దాఖలు చేయాల్సి ఉందని కోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా కేసు విచారణను ప్రారంభించేందుకు వీలుగా క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సెక్షన్‌ 207ని పూర్తి చేయకపోవడం వల్ల న్యాయవాదుల పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సెక్షన్‌ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోర్టు పేర్కొంది.
కాగా, ఫిబ్రవరి 2023లో ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీలో అవకతవకలు జరిగాయని సిబిఐ ఆరోపణల మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇడి మనీష్‌ సిసోడియాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సిసోడియా జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు.