Jul 28,2023 22:20

నియామె : దేశంలో ప్రజాస్వామ్యం విజయం సాధిస్తుందని నైజర్‌ అధ్యక్షుడు ప్రకటించారు. ఎంతగానో కష్టపడి సాధించుకున్నవనీు కచ్చితంగా రక్షించబడతాయని గురువారం ఉదయమే ట్వీట్‌ చేశారు. నైజీరియన్లందరూ ప్రజాస్వామ్యానిు ప్రేమిస్తారని వ్యాఖ్యానించారు. విదేశాంగ మంత్రి హసౌమి మసూదు కూడా ఇదే తరహాలో ప్రకటన చేశారు. ప్రజాస్వామిక కాముకులైన నైజీరియన్లు ఒక తాటిపై నిలబడి ఈ కుట్రను ఖండించాలని కోరారు. అధ్యక్షుడిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ లక్ష్యాల సాధనకుచర్చలు కొనసాగుతునాుయని చెప్పారు.
బుధవారం కుట్రకు పాల్పడిన సైనికులు అధ్యక్షుడిని బంధించారు. ఆయన దగ్గర నుండి తాము అధికారానిు చేజిక్కించుకునాుమని ప్రకటించారు. ఇదిలా వుండగా, అధ్యక్ష భవనంలో నెలకొను పరిస్థితులపై రాజధాని నియామె ప్రజలకు ఏమీ పట్టినట్లు లేదు. వారు తమ రోజువారీ కార్యకలాపాల్లో తలమునకలై వునాురు. అయితే దేశం ఎవరి అధీనంలో వుంది, ఎవరి వైపు మెజారిటీ మద్దతు వుందను అంశాల్లో స్పష్టత లేదు. రక్తపాతానికి దారి తీసే ఘర్షణలను నివారించేందుకుగానూ కుట్రకుతాను మద్దతునిస్తునాునని సైనిక కమాండ్‌ విభాగం ట్వీట్‌ చేసింది. అయితే ఆ ప్రకటన వాస్తవమా కాదాఅని నిర్ధారించడం సాధ్యం కాలేదు. ఇదిలా వుండగా, నైజర్‌ అధ్యక్షుడు మహ్మద్‌ బజూమ్‌కు పలు రాజకీయ పార్టీల మధ్దతు వునుట్లు తెలుస్తోంది. కాగా, ఈ కుట్ర ప్రయతుం ఆత్మహత్యా సదృశ్యమైనదని, పిచ్చితనంతో కూడినదని పలు పార్టీలు ఖండించాయి. బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన చేశాయి.