Feb 23,2023 22:18

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా ఐదోరోజూ నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకొని ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేశాయి. అక్కడ కొనుగోళ్ల మద్దతుతో కోలుకొని చివరి వరకు తీవ్ర ఒడుదొడుకుల్లో చలించాయి. చివరి అరగంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. వడ్డీరేట్ల పెంపు, అధిక ద్రవ్యోల్బణం వంటి పరిణామాలు సూచీలను కలవరపెట్టాయి.
ఉదయం సెన్సెక్స్‌ 59,777.64 దగ్గర ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 59,960.04- 59,406.31 మధ్య కదలాడింది. చివరకు 139.18 పాయింట్ల నష్టంతో 59,605.80 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (%చీఱట్‌y%) 17,620.05- 17,455.40 దగ్గర ట్రేడయ్యింది. చివరకు 43.05 పాయింట్లు నష్టపోయి 17,511.25 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.68 వద్ద నిలిచింది.
సెన్సెక్స్‌ (%ూవఅరవఞ%)30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా, మారుతీ, టీసీఎస్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌అండ్‌టీ, టైటన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు ఇంట్రాడేలో రూ.176.55 వద్ద 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ మేరకు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై దివాలా పరిష్కార ప్రణాళిక ప్రక్రియను ప్రారంభించడానికి ఎన్‌సీఎల్‌టీ ముంబయి ధర్మాసనం ఆదేశించింది. దీంతో సోనీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ విలీన ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడ్డాయి. అయితే, దీనిపై ఎన్‌సీఎల్‌ఏటీకి వెళతామని జీ సీఈఓ పునీత్‌ గోయెంకా తెలిపారు. తర్వాత షేరు కనిష్ఠాల నుంచి కోలుకుంది. చివరకు 3.46 శాతం నష్టపోయి రూ.199.20 వద్ద స్థిరపడింది.

షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కీలకేతర ఆస్తుల విభజనకు కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ అనుమతించింది. దీంతో కంపెనీ షేరు ఈరోజు 9.34 శాతం పెరిగి రూ.125.80 వద్ద ముగిసింది.

? అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల నష్టాలు గురువారం కూడా కొనసాగాయి. అదానీ పవర్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ ఐదు శాతం కుంగి లోయర్‌ సర్క్యూట్‌ని తాకాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 1.14 శాతం నష్టపోయి రూ.1,388.85 వద్ద స్థిరపడింది. అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, అంబుజా సిమెంట్స్‌ మాత్రం లాభాల్లో ముగిశాయి.
నినినినిని