చండీగఢ్ : ఉపాధి కోసం ప్రశ్నించిన ఓ మహిళపై బిజెపి పాలిత రాష్ట్రమైన హర్యానా సిఎం మనోహర్ లాల్ ఖట్టర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పోస్ట్ చేసిన వీడియో ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హర్యానాలో నిర్వహించిన బహిరంగ సభలో ఒక మహిళ తమకు ఉపాధి కోసం ఫ్యాక్టరీ కావాలని అడిగింది. దీనికి సమాధానంగా తదుపరి చేపట్టే చంద్రయాన్-4 మిషన్ ద్వారా ఆమెను చంద్రుడి మీదకు పంపుతామని సిఎం మనోహర్ లాల్ ఖట్టర్ వ్యంగ్యంగా అన్నారు. ఆపై కూర్చోవాలని ఆమెకు చెప్పారు.
ఈ ఘటనపై ఆప్ మండిపడింది. ఉపాధి కోసం ఫ్యాక్టరీని కోరడమే ఆ మహిళ చేసిన ఏకైక నేరమా? అని ప్రశ్నించింది. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం సిగ్గుచేటని విమర్శించింది. సేవ చేసేందుకు ప్రజల చేత ఎన్నికైన వారే ప్రజలను ఎగతాళి చేస్తున్నారని దుయ్యబట్టింది. ప్రధాని మోడీ స్నేహితులైన కోటీశ్వరులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇదే డిమాండ్ చేసి ఉంటే ఖట్టర్ వారిని ఆలింగనం చేసుకోవడంతో పాటు ప్రభుత్వం మొత్తాన్ని వారి సేవలో ఉంచేవారని మండిపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆప్ ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేసింది.
"अगली बार #Chandrayaan जाएगा तो उसमें तुमको भेज देंगे।"
— AAP (@AamAadmiParty) September 7, 2023
धिक्कार है ऐसे मुख्यमंत्री पर। जिन्हें जनता ने सेवा करने के लिए चुना था आज वही जनता का मज़ाक़ उड़ा रहे हैं।
महिला का अपराध इतना था कि उसने रोजगार के लिए फैक्ट्री मांगी
यही मांग अगर मोदी जी के अरबपति मित्रों ने अपने… pic.twitter.com/OERfbfaCGt
;