
- శ్రీలంక లక్ష్యం 263
లక్నో : ప్రపంచకప్‌లో లంకతో జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 262 పరుగులు చేసి శ్రీలంక ముందు 263 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ బ్యాటర్లకు శ్రీలంక బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో 24 ఓవర్లకు నెదర్లాండ్స్ 6 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. ఓపెనర్ విక్రమ్‌జిత్ (4)ను కాసున్, మాక్స్ ఔడౌడ్ (16), కోలిన్ అకెర్మాన్ (29), బాస్ డి లీడే (6), తేజ నిడమనూరు (9), స్కాట్ ఎడ్వర్డ్స్ (16) వెంటవెంటనే ఔటయ్యారు. అనంరతం క్రీజులోకి వచ్చిన సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (70), వాన్ బీక్ (59) పరుగులతో రాణించారు. వాన్‌బీక్, సిబ్రాండ్ జోడీ ఏడో వికెట్‌కు 130 పరుగులు చేశారు. ఈ క్రమంలో 230 పరుగుల వద్ద సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (70)ని మదుశంక ఔట్ చేశాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన రోలోఫ్ వాన్ డెర్ మెర్వే 7, ఆర్యన్ దత్ 9, పాల్ వాన్ మీకెరెన్ 4 పరుగులు చేయండంతో నెదర్లాండ్స్ 262 పరుగులు చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక 4, కసున్ రజిత 4, మహేశ్ తీక్షణ 1 వికెట్ తీసుకున్నారు.