ప్రజాశక్తి-రాంబిల్లి : నేవీ మెయిన్ గేటు ముందు ఈనాటికి 82 రోజులగ కొనసాగుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలను పట్టించుకోలేదంటు నేవీ నిర్వాసితులు ఆందోళన చెందారు. శారద, వరాహ, నదులలో వేటకు వెళ్లి తమ జీవనాన్ని కొనసాగించే వాళ్ళమంటూ నేవీలో వెళ్లకుండా గేట్లు మూసేసి తమ ఉపాధి లేకుండా చేశారంటూ 8 గ్రామాలు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఆధార్ కార్డు ద్వారా వేటకు వెళ్లే అవకాశం కల్పించాలని లేదంటే తమకు జట్టి నిర్మించాలని ఎనిమిది గ్రామాలు జేఏసీ పెద్దలు కోరారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేదంటే మరింత ఉదృతం చేస్తామంటూ అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ పాదయాత్ర చేస్తూ వెళ్తామంటూ జేఏసీ పెద్దలు ఎనిమిది గ్రామాల నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.










