Jan 29,2023 15:46

ప్రజాశక్తి-రాంబిల్లి : నేవీ మెయిన్ గేటు ముందు ఈనాటికి 91రోజులుగా కొనసాగుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలను పట్టించుకోలేదంటూ నేవీ నిర్వాసితులు ఆందోళన చెందారు. శారద, వరాహ, నదులలో వేటకు వెళ్లి మా జీవనాన్ని కొనసాగించే వాళ్ళు మంటూ తమకు ఆధార్ కార్డు ద్వారా వేటకి వెళ్లి అవకాశాన్ని కల్పించాలని లేదంటే మాకు జట్టి నిర్మించాలని తెలిపారు. ఇప్పటివరకు ఆధార్ కార్డు ద్వారా వెళ్లి జీవనాన్ని శారదా వరాహ నదుల్లో వెళ్లి జీవనాన్ని కొనసాగించే వాళ్ళమంటూ, లేదంటే మాకు ఉపాధి కల్పించాలని లేదంటే ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి జి దేముడు నాయుడు మాట్లాడుతూ వెంటనే మత్స్యకారి సమస్యలు పరిష్కరించాలని లేదంటే అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ పలుమార్లు జిల్లా కలెక్టర్ కి తమ సమస్యలు చెప్పినప్పటికీ పట్టించుకోలేదంటూ లేని పక్షం రాష్ట్ర రాజధాని అయిన అమరావతికి వెళ్లడానికి వెనకాడమంటూ సిపిఎం మండల కార్యదర్శి దేవుడు నాయుడు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది గ్రామాలకు చెందిన నిర్వాసితులు జేఏసీ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.