ప్రజాశక్తి-రాంబిల్లి : నేటికీ 33 రోజులుగా నేవీ నిర్వాసితుల ఆందోళన కొనసాగుతుంది. నేవీని ర్వాసితులైన కొత్తపట్నం, వాడ నరసాపురం గ్రామాల మత్స్యకారులు శారదా వరాహ నదుల నుండి సముద్రంలోనికి చేపల వేటకు వెళ్లి వచ్చేవారు. నెల రోజుల క్రితం న్యావివారు గేట్లు బంద్ చేయడంతో వేరే గత్యంతరం లేక నేవీ నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. కొప్పుగొండపాలెం నేవీ కాలనీ నిర్వాసితులకు గత ఒప్పందంలో ఉన్న మినిట్స్ అమలు చేయకపోవడంతో, కొత్తపేట చిన్న కలవలపల్లి గోవింద పాలెం వాడపాలెం గ్రామాలు నేవీ వలన ఉపాధి కోల్పోయి మాకు అన్యాయం జరిగింది. న్యాయం చేయండి అని రెండు దఫాలుగా ఆందోళన చేశారు. ఆ సమయంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చి నేటికీ వారికి న్యాయం చేయకపోవడంతో వారు ఈ గ్రామాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన బాట పెట్టారు. నిర్వాసితులతో ఇప్పటికీ మూడు దఫాలుగా జిల్లా కలెక్టర్, ఉన్నత అధికారులు, ఎమ్మెల్యేచర్చలు జరిపిన నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లను అంగీకరించడంలో సరైన పద్ధతి పాటించలేదని నిర్వాసిత పెద్దలు వాపోయారు. అన్ని వైపులా మమ్మల్ని బంధించి మీరు బ్రతకండి అంటే ఎలా అని నిర్వాసితులు ప్రశ్నించారు. గత ఒప్పందంలో జెట్టి కడతామని చెప్పి నేడు జట్టి కట్టలేమంటే మత్స్యకారుల జీవన పరిస్థితి ఏమిటని వాపోయారు. మా భూములు గ్రామాలు తీసుకొని మాకు పూర్తిస్థాయిలో న్యాయం చేయకపోతే మేము ఎలా బ్రతకాలి అని నిర్వాసి గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మా న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే, తాసిల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నిర్వాసిత పెద్దలు గ్రామాల ప్రజలు హెచ్చరించారు.










