ప్రజాశక్తి-రాంబిల్లి : నేవీ నిర్వాసితులు 56వ రోజు కొనసాగిన ఆందోళన నేవీ నిర్వాసితుల సమస్యలపై ఢిల్లీలోని డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్, డిఫెన్స్ అధికారులను, కలిసి వచ్చిన జేఏసీ పెద్దలు ఈరోజు ధర్నా శిబిరం వద్దకు వచ్చి మాట్లాడారు. కొత్తపట్నం వాడ నరసాపురం, కొప్పుగొండపాలెం, నేవీ పునరావాస్ కాలనీ, ప్రభావిత గ్రామాలైన, చిన్న కలవలపల్లి కొత్తపేట గోవింద పాలెం వాడపాలెం గ్రామాల సమస్యలపై డిఫెన్స్ మినిస్టర్ కి, డిఫెన్స్ అధికారులు నేవీ అధికారులు, మన జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి, ఆధ్వర్యంలో చర్చలు జరిగాయని జెసి పెద్దలు తెలియజేశారు. మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరోసారి నిర్వాసితుల సమస్యలపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 26.12.2022న చర్చలు జరుపుతామని నిర్వాసిత పెద్దలందరూ రావాలని జిల్లా అధికారులు నేవీ అధికారులు సమాచారం ఇచ్చారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి, జి దేముడు నాయుడు, జేఏసీ పెద్దలు, నిర్వాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










