ప్రజాశక్తి-రాంబిల్లి : నేవల్ బేస్ నిర్వాసితులు నేటికీ 45 రోజులుగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలనిఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళన శిబిరాన్ని సందర్శించిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కె లోకనాథం మాట్లాడుతూ నేవీ నిర్వాసితులు తమ సమస్యలు పరిష్కరించాలని అనేక రోజుల నుండి రోడ్డుపై బైఠాయించి నిరసన చేస్తున్నప్పటికీ వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోవడం అన్యాయం అన్నారు. వెంటనే వీరి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ ప్రాంతంలో పర్యటించినప్పటికీ, నిర్వాసితులతో మాట్లాడినప్పటికీ, నిర్వాసితులు సమస్యలు పట్ల స్పష్టమైన హామీలు ఇవ్వకపోవడం, వాటి అమలుకు కృషి చేయకపోవడం బాధాకరం అన్నారు. పిఏఎఫ్ పిడిఎఫ్ గ్రామాల ప్రజల సమస్యలతో పాటు, నేవీ ప్రభావిత గ్రామాల చిన్న కలవలపల్లి కొత్తపేట గోవింద పాలెం వాడపాలెం నిర్వాసితుల సమస్యలను గుర్తించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులందరికీ ఉపాధి కచ్చితంగా కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జి దేవుడు నాయుడు, జేఏసీ పెద్దలు, నిర్వాసితులు పాల్గొన్నారు.










