ప్రజాశక్తి-రాంబిల్లి : నావల్ బేస్ నిర్వాసితులు నేటికీ 61 రోజులుగా ఆందోళన చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం లేదని ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చోడి పెళ్లి గంగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. 8 గ్రామాల ప్రజలు నేవల్ బేస్ నిర్మాణం వలన తమ జీవనోపాధి కోల్పోయారని, నిర్వాసితుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి, జిల్లా అధికారి యంత్రాంగం చిత్తశుద్ధితో వ్యవహరించకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. నిర్వాసిత పెద్దలతో, అఖిలపక్ష నాయకులతో, జిల్లా అధికార యంత్రాంగం అనేకసార్లు చర్చలు జరిపిన సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని నేవీ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు శారద వరాహ నదులు ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయడం అంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు. నేవీ నిర్వాసితుల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నర్సీపట్నం వస్తున్న సందర్భంగా, ఎనిమిది గ్రామాల పెద్దలను తీసుకొని, స్థానిక ఎమ్మెల్యే యువి రమణమూర్తి రాజు, మంత్రి అమర్నాథ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి నేవీ నిర్వాసితుల సమస్యలు తెలపడం జరిగిందని, నిర్వాసితులు చెప్పిన సమస్యలను ముఖ్యమంత్రి విని... సమస్యలపై విజయానంద్, జిల్లా కలెక్టర్, కమిషనర్ కన్నబాబుకి ఆదేశాలు జారీ చేసాము. వారు మీ సమస్యలు పరిష్కారానికి కార్యచరణ చేపట్టారని నిర్వాసిత పెద్దలకు ముఖ్యమంత్రి తెలిపినట్లు నిర్వాసిత పెద్దలు చెప్పారు.










