May 01,2023 20:56
  • రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ఇవ్వాలి
  • 'సేవ్‌ ఎడ్యుకేషన్‌, సేవ్‌ నేషన్‌' నినాదంతో నేషనల్‌ ఎడ్యుకేషన్‌ అసెంబ్లీ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి)కి ప్రత్యామాుయ ప్రజానుకూల విద్యా విధానం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ అసెంబ్లీ పిలుపు ఇచ్చింది. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ విద్య, ఆధునిక, సాంస్కృతికంగా విభినుమైన, సమానమైన, స్వావలంబన కలిగిన ఆర్థిక వ్యవస్థను, సమాజంలో ప్రజల సామర్థ్యాలను అభివృద్ధి చేస్తుందని పేర్కొంది. ఎన్‌ఇపి పేద, దళిత, గిరిజన, మైనార్టీ, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు విద్యను దూరం చేస్తోందని, దీనిు వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. 'సేవ్‌ ఎడ్యుకేషన్‌, సేవ్‌ నేషన్‌' నినాదంతో హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ (హెచ్‌కెఎస్‌) భవన్‌లో ఆలిండియా పీపుల్స్‌ సైన్స్‌ నెట్‌వర్క్‌ (ఎఐపిఎస్‌ఎన్‌), భారత్‌ జ్ఞాన్‌ విజ్ఞాన సమితి (బిజివిఎస్‌) సంయుక్తంగా నేషనల్‌ ఎడ్యుకేషన్‌ అసెంబ్లీ నిర్వహించాయి. ఎస్‌ఎఫ్‌ఐ, ఎస్‌టిఎఫ్‌ఐ, ఐద్వా, ఎఐడిఎస్‌ఒ, ఎఐఎఫ్‌యుసిటిఒ, డిటిఎఫ్‌, ఎఫ్‌ఇడిసియుటిఎ, జెఎన్‌యుటిఎ, ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌, ఎఐఎస్‌ఇసి, ఎఐఎఫ్‌ఆర్‌టిఇ, జెఎసి, జెఎఫ్‌ఎంఇ, ఆర్‌టిఇ ఫోరం తదితర సంఘాలు మద్దతు ఇచ్చాయి. ఈ సమావేశం ఎన్‌ఇపి, దాని అవాంఛనీయ లక్షణాలను తిప్పికొట్టడానికి, ప్రగతిశీల, ప్రజా అనుకూల ప్రభుత్వ విద్యా వ్యవస్థ కోసం పనిచేయడంలో రాష్ట్ర ప్రభుత్వాల సహకారం, మద్దతును కోరింది.

  • విద్యాను సరుకుగా మార్చే వాహనంగా ఎన్‌ఇపి : ఆర్‌ బిందు

ఈ అసెంబ్లీని ప్రారంభిస్తూ విద్యను వర్గీకరించడానికి, సరుకుగా మార్చడానికి ఒక వాహనంగా ఎన్‌ఇపి పనిచేస్తుందని కేరళ ఉనుత విద్యాశాఖ మంత్రి ఆర్‌ బిందు విమర్శించారు. కార్పొరేట్‌ శక్తులతో, మతోన్మాద శక్తులు చేతులు కలుపుతును ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎన్‌ఇపిని చూడాలని అనాురు. దేశంలోని సమాఖ్య సూత్రాలను నిరాకరిస్తూ కేంద్రీకరణను విధించాలని ఎన్‌ఇపి స్పష్టం చేస్తుందనాురు. ఎన్‌ఇపిని పార్లమెంటరీ పరిశీలన చేయాలని డిమాండ్‌ చేశారు. 'ఒక విద్యా విధానం గత విధానం డాక్యుమెంట్ల ప్రభావాలు, మెరిట్‌లు, లోపాలను పరిశీలించాలి. కానీ ఎన్‌ఇపి గత విధానం డాక్యుమెంట్ల ప్రభావానిు అధ్యయనం చేయడానికి ఎప్పుడూ ప్రయతిుంచలేదు' అని బిందు విమర్శించారు. రాష్ట్రం, దానిప్రజల నిర్దిష్ట అవసరాలకు సరిపోయే ఉనుత విద్యా నమూనాతో ఎన్‌ఇపిని నిరోధించడం కేరళలో చేస్తునాుమనిబిందు చెప్పారు. యుజిసి మాజీ ఛైర్మన్‌, ప్రొఫెసర్‌ సుఖ్‌దేవ్‌ థోరట్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసే మంచి అవకాశానిు దుర్వినియోగం చేస్తోందనివిమర్శించారు. సమానత్వం, అందరికీ విద్యపై నూతన విద్యా వ్యవస్థలో ఎటువంటి ప్రతిపాదనలు లేవని అనాురు.
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ డీన్‌, ప్రొఫెసర్‌ అనిత రామ్‌పాల్‌ మాట్లాడుతూ.. విద్యార్థులకువిద్యను దూరం చేసే విధానమే ఎన్‌ఇపి అనిపేర్కొనాురు. ఎన్‌యుఇపిఎ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ ఎన్‌వి వర్గేశ్‌ మాట్లాడుతూ.. ఉనుత విద్యా వ్యవస్థను మార్కెట్‌గా, విద్యను సరుకుగా ఎన్‌ఇపి చూస్తుందని విమర్శించారు. కార్పొరేట్లకు అనుసంధానం చేసే వ్యవస్థను ఇప్పుడు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయతిుస్తుందనాురు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు యూసఫ్‌ తరిగామి మాట్లాడుతూ.. దేశ ప్రజలకుమంచి భవిష్యత్తు ఇచ్చే విద్యా విధానం ఉండాలని అనాురు. ఈ కార్యక్రమంలో ఎఐపిఎస్‌ఎన్‌ ప్రధాన కార్యదర్శులు సత్యజిత్‌ రాత్‌, ఆశా మిశ్రా, ఎఐపిఎస్‌ఎన్‌ కోశాధికారి ఎస్‌ఆర్‌ ఆజాద్‌, శాస్త్రవేత్త డి రఘునందన్‌, బిజివిఎస్‌ ప్రధాన కార్యదర్శి కాశ్‌నాథ్‌ ఛటర్జీ, ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, జెఎన్‌యుటిఎ అవినాష్‌ మిశ్రా, జెఎఫ్‌ఎంఇ ఛైర్‌పర్సన్‌ నందితా నారాయణ్‌, ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి మయూక్‌ బిశ్వాస్‌, సహాయ కార్యదర్శులు డినిత్‌ డెంటా, నితీష్‌ నారాయణ్‌ మాట్లాడారు. వివిధ సాంస్కృతిక బృందాలు నృత్య ప్రదర్శన చేయగా, మరికొనిు బృందాలు గీతాలాపన చేశాయి. నూతన విద్యా విధానంపై షార్ట్‌ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలను ప్రదర్శించారు.