Oct 04,2023 11:24

ముంబయి :   మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రభుత్వాస్పత్రిలో అపరిశుభ్రత తాండవిస్తోంది. 48 గంటల్లో 16 మంది చిన్నారులు సహా 31 మంది రోగులు మరణించిన సంగతి తెలిసిందే. వరుస మరణాలకు దారితీసిన ప్రధాన సమస్యల్లో పరిశుభ్రత కూడా ఉంది. అయినప్పటికీ ప్రభుత్వ అధికారులు ఆస్పత్రిలో ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. పందులు సంచరిస్తుండటంతో పాటు అక్కడి కాలువలన్నీ ప్లాస్టిక్‌ సీసాలతో నిండిపోయాయి. ఆ ప్రాంతాల్లోనే రోగుల కుటుంబసభ్యులు పాత్రలు కడగడంతో పాటు రోజువారీ కార్యక్రమాలను నిర్వహిస్తున్న దృశ్యాలు మీడియాలో వైరలయ్యాయి. ఇక్కడి టాయిలెట్‌ను వినియోగించలేక .. బయటకు వెళుతున్నామని ఓ మహిళ పేర్కొన్నారు. రోజూ ఇలాగే ఉంటుందని .. అధికారులెవరూ పట్టించుకోవడం లేదని మరో మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు.