Aug 14,2020 13:21

న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ  నిలకడగా వుంది. ఆయన ఆరోగ్యం ఈ రోజు ఉదయం వరకు నిలకడగానే ఉన్నట్లు ప్రణబ్ చికిత్స పొందుతున్న ఆర్ అండ్ ఆర్ ఆర్మీ హాస్పిటల్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ప్రణబ్ ఇంటెన్సివ్ కేర్‌లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. ఆయన వైటల్ సైన్స్ అన్సీ నిలకడగానే ఉన్నాయని వైద్యులు తెలిపారు. ప్రణబ్ వారం క్రితం బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నారు. ఆ చెకప్ లో భాగంగా ఆస్పత్రికి వెళ్లిన ఆయనకు కరోనా రావడంతో అక్కడే ఉంచి వైద్యం అందిస్తున్నారు.