Jan 10,2021 18:07

ఇక్కడ
ఒంటరి సంఘర్షణ
దేశాన్ని మోస్తోంది
తెల్ల కాలరు
బిచ్చగాళ్ళను ప్రశ్నిస్తూ
ప్రశ్నించడంలో బాధ్యతుంది
బాధ్యతలో భరోసా ఉంది
భరోసాలో ఉద్యమం ఉంది
ఉద్యమంలో ప్రగతుంది
ప్రగతిలో దేశ ముఖచిత్రముంది
దేశ ముఖచిత్రంలో దేహముంది.

మడతపడని ఉద్యమంలో మరణాలున్నై
మరణాలలో బాధలున్నై
బాధల్లో మనసులున్నై

మనసుల్లో అగ్ని ఉంది.
అగ్నిలో పోరాటం ఉంది
పోరాటంలో గెలుపుంది
గెలుపులో మలుపుంది
మలుపులో మెరుపుంది.
మెరుపులో ఆకలుంది
ఆకలిలో చీకటుంది
చీకటిలో వెలుగుంది
వెలుగు నేత చొక్కాలో ఉంది.

ఇప్పుడు..సరిగ్గా ఇప్పుడే
నువ్వు సముద్రమవ్వాలి
సముద్రంలో ఉప్పెనవ్వాలి.
ఉప్పెనతో వాడికి ముప్పవ్వాలి.

ముప్పుతో ముంచాలి
ముంచి ముంచి కంచెవేయాలి.
ఆ కంచే దేశం మెతుకుల్ని కాపు కాయాలి
ఆ కాపు దేశమంతా విస్తరించాలి.

విస్తరించి ఆకలి పేగుల్లో
నిప్పులు చల్లార్చాలి.
ఇక చర్చలొద్దు సెర్చులొద్దు.
విజయమొక్కటే నీ హద్దు.

                         * కొత్తపల్లి మణీత్రినాథరాజు, 9949389296