ప్రజాశక్తి-నందిగామ : నందిగామ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కు సెలెక్ట్ అయిన పట్టణంలోని 2వ వార్డ్ కు చెందిన పుప్పాల మోహన్ సాయిని శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ శుక్రవారం అభినందించి, సత్కరించారు.
ఈ సందర్భంగా పుప్పాల మోహన్ సాయి మాట్లాడుతూ మొన్న జరిగిన సౌత్ జోన్ నేషనల్స్ లో రన్నింగ్ విభాగానికి సంబంధించి గోల్డ్ మెడల్ వచ్చిందని, జూనియర్ నేషనల్స్ లో ఆరవ స్థానంలో నిలిచానని, డిస్టిక్ జూనియర్స్ అథ్లెటిక్స్ లో రన్నింగ్ విభాగంలో మొదటి స్థానంలో ఉన్నానని తెలిపారు. ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ నాకు ఎంతో సహకరించి, ఆర్థిక సహాయం అందజేసి ప్రోత్సహించారని క్రీడాకారుడు మోహన్ సాయి తెలిపారు.










