Jan 12,2023 12:19

ప్రజాశక్తి-విశాఖ : భీమిలీ మండలం వలంద పేటలో విహహితర సంబంధం వ్యక్తి హత్యకు కారణమైంది. భార్య జ్యోతి (26), భర్త పైడరాజు (34)ను ప్రియుడు శ్రీనువాసురావు (23) సాయంతో హతమార్చారు. భీమిలీలో చంపి బండి మీద డెడ్ బాడీను తీసుకొని వచ్చి.. కైలాషగిరి స్మశాన వాటికలో దహనం చేసినట్లు తెలుస్తోంది. మృతుడు అన్నయ్య వంక చిన్నారావు ఫిర్యాదుతో భీమిలీ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. మరోసారి మధురవాడ సాయిరాం కాలనీలో దుబాయ్ నుండి వచ్చిన భర్త శ్రీనివాస్ ను భార్య మృదుల కేసును ఈ ఘటన తలపించింది. మీసింగ్ కేసు విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులో చూశాయి. భీమిలీ సిఐ లక్ష్మణ్ మూర్తి కేసు దర్యాప్తులో నిజాలు బయటపడ్డాయి.