ప్రజాశక్తి-నందిగామ : ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారు పల్లగిరి కొండపై ఒక వ్యక్తిని బీరు సీసాలతో పోడిచి దారుణ హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. హత్యకు గురైన వ్యక్తి కంచికచర్ల మండల కీసర గ్రామానికి చెందిన కుర్రాకుల వెంకటేశ్వరరావు(35)గా సమాచారం. సాంబయ్య అనే వ్యక్తికి డబ్బులు ఇవ్వాలని కారణంతో ఈ హత్య చేశాడని మృతుని బంధువులు తెలుపుతున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని నందిగామ మార్చురీకి తరలించిన పోలీసులు విచారణ చేపట్టారు.










