Apr 24,2023 15:14

ప్రజాశక్తి-కారంచేడు : మండలంలోని దగ్గుబాడు గ్రామపంచాయతీలో సోమవారం గ్రామ పారిశుద్ధ సిబ్బందికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. దేశాభివృద్ధికి మూలం గ్రామాభివృద్ధే అని గ్రామాభ్యుదయానికి గ్రామపంచాయతీల ఏర్పాటు, వాటికి విస్తృత అధికారాలు ఇవ్వడానికి రాజ్యాంగం ప్రాధాన్యం ఇచ్చిందని గ్రామ సర్పంచి గేరా రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామాల అభివృద్ధికి ఆ గ్రామ ప్రజలే పాటుపడటానికి వీలు కల్పించారని ఠాగూర్ తెలియజేశారు. అనంతరం గ్రామంలోని గ్రామపంచాయతీ సిబ్బందిని, పారిశుద్ధ సిబ్బందిని సన్మానించడం చేశారు. పంచాయతీ సెక్రటరీ కే జోష్న, సచివాల సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.