
తెలంగాణ : ములుగు జిల్లాల్లో అటవీ ప్రాంతంలో చిక్కుకున్న పర్యాటకులను డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు క్షేమంగా సురక్షిత ప్రాంతానికి తరలించారు. వీరభద్రవరం గ్రామ శివారులోని ముత్యంధార జలపాతం సందర్శనకు బుధవారం ఉదయం వెళ్లిన దాదాపు 80మంది పర్యాటకులు సాయంత్రం తిరుగు ప్రయాణంలో వరదలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలను సంఘటనా స్థలానికి పంపారు. పర్యాటకుల వద్దకు రెస్క్యూ బృందాలు చేరేవరకు వాగును దాటేందుకు ప్రయత్నించవద్దని వారిని హెచ్చరించినట్టు ఎస్పీ పేర్కొన్నారు. ఆహార పదార్థాలతో పాటు ఇతర రెస్క్యూ పరికరాలను పంపుతున్నామని వంటి అనేక సూచనలు చేశామని పేర్కొన్నారు.