
హైదరాబాద్: సినీ నటి దివ్యవాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే.. దివ్యవాణికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దివ్య వాణి 2019లో టిడిపిచేరారు. ఆ తర్వాత 2022లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.