హైదరాబాద్ : చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి ఇల్లు, కార్యాలయాల్లో ఐటి అధికారులు మంగళవారం తెల్లవారుజాము నుండి సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ, మంచిర్యాలలోని ఆయన నివాసాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. బేగంపేటలోని వివేక్ కార్యాలయంలోనూ సోదాలు చేపట్టారు. ఈరోజు సాయంత్రం వరకు ఐటి తనిఖీలు కొనసాగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.