Sep 13,2023 11:20

రాబట్‌ :   మొరాకోలో సంభవించిన పెను భూకంపంలో మరణించిన వారి సంఖ్య 2,862కు చేరింది. రెండున్నర వేల మందికి పైగా గాయపడ్డారు. రిక్టర్‌ స్కేలుపై 6.8 తీవ్రతతో శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపం ధాటికి మొరాకోలోని పలు నగరాలు ధ్వంసమయ్యాయి. అనేక భవనాలు కుప్పకూలాయి. గత 60 సంవత్సరాలలో ఇంతటి పెనువిషాదం ఎన్నడూ సంభవించలేదని స్థానిక మీడియా తెలిపింది. 1960లో దేశంలోని పశ్చిమ ప్రాంతంలో సంభవించిన భూకంపం కారణంగా కనీసం 12 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్లపై పెద్దపెద్ద బండరాళ్లు అడ్డుగా పడడంతో శిథిలాల తొలగింపు కోసం అవసరమైన సామగ్రి ఇప్పటికీ బాధిత ప్రదేశాలకు చేరుకోలేదు.