Nov 12,2023 13:05

జకార్తా :  ఇండోనేషియాలోని వెస్ట్‌ తైమూర్‌ సమీపంలో ఆదివారం మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 5.6 తీవ్రతగా నమోదైనట్లు జర్మన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ జియోసైన్సెస్‌ (జిఎఫ్‌జెడ్‌) తెలిపింది. 10కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ప్రకటించింది. పలు నగరాల్లో భూకంపం తీవ్రత అధికంగా ఉందని, అయితే నష్టం గురించి సమాచారం లేదని అన్నారు.  గతవారం నవంబర్‌ 2న ఇండోనేషియాలోని తూర్పు నుసా టెంగ్‌గారా ప్రావిన్స్‌లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.