
జకార్తా : ఇండోనేషియాలో బుధవారం ఉదయం శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.9గా నమోదైనట్లు యూరోపియన్ మధ్యధరా సిస్మోలాజికల్ సెంటర్ (ఇఎంఎస్‌సి) తెలిపింది. భూకంపం ఇండోనేషియాలోని అంబన్‌కు ఆగేయంగా 370 కి.మీ దూరంలో ఉందని, 146 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ఇఎంఎస్‌సి పేర్కొంది. ఆ తర్వాత కూడా వరుసగా ప్రకంపనలు వచ్చినట్లు ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక విభాగం తెలిపింది. అయితే సునామీ ప్రమాదం లేదని ప్రకటించింది.