May 14,2023 15:55
  • విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ మోపిదేవి

ప్రజాశక్తి-నగరం : సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న మత్యకారుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు సమక్షేమ పథకాలు అందిస్తున్నారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు అన్నారు. చేపల వేట నిషేధ సమయంలో మత్యకార కుటుంబాలకు ఆర్దిక చేయుతను అందించేందుకు ఈ నెల16వ తేదీన నిజాంపట్నం వస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలనే ఆశయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. మత్య కారులకు గతంలో నాలుగు వేల రూపాయలు అందించే వారని నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి 10 వేల రూపాయలు అందజేస్తున్నారని తెలిపారు. 16న జరిగే ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.