ప్రజాశక్తి కౌతాళం : మత సమరాస్యానికి ప్రత్యేక మొహరం వేడుకలు కర్నూల్ జిల్లా కౌతాళం మండలంలో ఘనంగా నిర్వహించారు. శనివారం కౌతాళం, హాల్వి, గుడి కంబాలి, వల్లూరు, నది చాగి, కాత్రికి, చూడి, చిరుతపల్లి, ఉరుకుంద ఎరిగేరి, బాపురం, రౌడూరు, ఉప్పర హా లు, బదినే హాలు, కుంటన హాలు ఆయా గ్రామా భక్తి శ్రద్దలతో పీర్ల దేవుళ్లను పూజించారు. పదవరోజు పీర్లను ఊరేగింపు చేశారు. పీర్ల చాబిళ్ళను విద్యుత్ దీపాలు అలంకరించారు. కౌతాళంలో శ్రీ జగద్గురు ఖాదర్ లింగ స్వామి ధర్మకర్త సయ్యద్ మున్నా పాష ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి తిలకించారు. అనంతరం కర్ బల మైదానంలో దఫన్ చేయడంతో వేడుకలు ముగిశాయి. ఎక్కడ ఘర్షణలు సంఘటనలు జరగకుండా ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు.










