
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలోని పాఠశాలలకు శనివారం నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ సెలవులు ఉన్నాయి. క్యాలెండర్ ప్రకారం ఈ నెల 24వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయి. ఈ నెల 25వ తేదిన తిరిగి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. మైనార్టీ విద్యాసంస్థలకు ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయి.